తెలంగాణ ప్రాంతంలోని సమైక్యవాదుల లాగులు ఊడగొట్టి తరిమే సమయం అతి దగ్గర్లోనే ఉందని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతలు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మరుక్షణం ఇది జరుగుతుందని ఆ పార్టీ సీనియర్ నేతలు నాయిని నర్శింహా రెడ్డి, చంద్రశేఖర్ జోస్యం చెప్పారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోందని వారు ఆరోపించారు.
తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ల ముట్టడి జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నేత నాయిని నర్సింసింహా రెడ్డి, చంద్రశేఖర్‌లు ప్రసంగిస్తూ తెలంగాణలోని పోలీసు బలగాలను చూస్తుంటే రాష్ట్రపతి పాలనను తలపిస్తోందన్నారు. అందువల్ల కొత్తగా రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారని గుర్తు చేశారు.
రాష్ట్ర పాలనా పగ్గాలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో లేవని గవర్నర్ నరసింహన్ వద్ద ఉన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ తీరు తెలంగాణకు అవమానంగా ఉందన్నారు. అనంతరం తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ఇప్పటికైనా వారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించాలన్నారు. కాంగ్రెస్, తెదేపాలు తెలంగాణపై తమ పార్టీ వైఖరిని స్పష్టం చేయాలన్నారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి మెత్తబడిందన్న వార్తలను మాజీ మంత్రి, తెరాస సీనియర్ నేత సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ తోసిపుచ్చారు. సమైక్యవాదుల లాగులు ఊడగొట్టి వారిని పంపించే రోజు అతి దగ్గర్లోనే ఉందన్నారు. తెలంగాణ తెలుగుదేశం నేతలుకు సిగ్గు ఉంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఉద్యమించాలన్నారు.

No comments:
Post a Comment