Friday, November 12, 2010

2014 వరకు తెలంగాణ రాష్ట్రం?

కేంద్ర హొంమతృత్వశాఖ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు డిసెంబర్ 9న చేసిన ప్రకటన తదుపరి పరినామాలు, అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల భిన్నాభిప్రాయాలు గందరగోళ వాతావరణాన్ని సృష్టించిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనపై వేసిన శ్రీకృష్ణ కమిటీ ఈ డిసెంబర్  31 వరకు  కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న తరునంలో సర్వత్రా ఉత్కంటత ,  ఆందోళన వ్యక్తమౌతోంది. కమిటీ నివేదిక ఎలా ఉన్నా తెలంగాణాలోని అన్ని వర్గాల ప్రజలు, నేతలు ఇక సహనం వహించే స్థితిలో లేరు. అయినా  కుడా ఈ ప్రాంత ప్రజలు 2014 వరకు ఓపిక పట్టక తప్పని పరిస్థితులు ఉన్నాయనే చెప్పవచ్చు.శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించే ముందైనా, తరువాతైనా కేంద్ర హొం, రక్షణ మతృత్వశాఖలో ఏదో ఒక శాఖ వివిధ రాజకీయ పార్టీ నేతలు, ముఖ్య ప్రజా సంఘాలతో  శాంతి బధ్రతలపై  సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమైన  ఇప్పటికిప్పుడు కేంద్రం ప్రకటిస్తే..ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత  ఏర్పడే  అవకాశాలున్నాయి. సీమాంధ్రకు ప్రత్యేక  ప్యాకేజీ, అక్కడి  ప్రాంత ప్రజల  రాజధాని విషయంలో సంతృప్తి పరచే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం సీమాంద్ర ప్రాంతంలో  తన ప్రాబల్యాన్ని తగ్గించుకోకుండా, అదే సమయంలో తెలంగాణలో కూడా వ్యతిరేకత రాకుండా ఆది నుండి జాగ్రత్త పడుతూనే ఉంది. భవిష్యత్తులో అదే తరహాలో కేంద్రం ముందుకేల్లబోతుందనడంలో అతిశయోక్తి లేదు. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంకేతాన్నిస్తే వెంటనే కేంద్రం ప్రకటించే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. సీమాంధ్ర నేతలు పార్టీలకు అతీతంగా ఏకమై కేంద్రప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాల మధ్య చిచ్చు రగిల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీ, ప్రభుత్వ మనుగడకు అవరోధం కలిగేవిధంగా తెలంగాణా అంశం ఉన్నందున మరో రెండు మూడేళ్ళపాటు విభజనను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేయవచ్చు. 

No comments:

Post a Comment