సిఎం,పోలీసుశాఖ ఉన్నతాధికారి మొండి వైఖరి తెలంగాణా ప్రాంతాన్ని బగ్గుమనేలా చేస్తోంది. ఎస్ ఐ ఉద్యోగాల నియామకాన్ని సిఎం, డిజిపిలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. గ్రూప్-1 మాదిరిగానే ఈ పరీక్షలు కూడా పోలీసు పహారా మధ్య కొనసాగించి మరోసారి తమ పంతం నేగ్గించుకోవాలని చూస్తున్నట్లు డిజిపి తీరును బట్టి చెప్పవచ్చు. హైదరాబాద్ ను ఆరవ జోన్ గా ప్రకటించాలని అప్పటివరకు ఎటువంటి నియామకాలు, పరీక్షలు నిర్వహించరాదని విద్యార్థులు, ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు ఆందోళన చేస్తున్నా డిసెంబర్ 18, 19 లలో ఎస్ ఐ రాత పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని మంకుపట్టు పట్టడం శోచనీయం. ఒకవైపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీయనున్న ఈ నేపధ్యంలో బుధవారం సిఎం, హొం మంత్రి సమావేశం పిదప మంత్రి సబితారెడ్డి మాట్లాడకపోవడం, డిజిపి నిర్ణయాధికారిగా వ్యవహరించడం పట్ల తెలంగాణా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.హైదరాబాద్ ను ఆరవ జోన్ గా ప్రకటించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి 9 నెలలు గడుస్తున్నా కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తేకపోవడం, కేంద్ర మంత్రుత్వ శాఖ నుండి ఫైల్ తిరిగొచ్చి 4 నెలలు గడుస్తున్నా సిఎం శ్రద్ద చూపకపోవడం రోశయ్య నిర్లక్ష్యం తేటతెల్లమౌతోంది. 1000 మంది విద్యార్థులతో ఆమరణ దీక్ష చేస్తామని ఓయూ జేయేసీ ప్రకటించింది. తెలంగాణ అన్ని జిల్లాలలో గురువారం రాస్తారోకోలు చేయాలని టి ఆర్ ఎస్ పిలుపునిచ్చింది. టిడిపి తెలంగాణ ఫోరం విద్యార్థుల ఆందోళనకు మద్దతు ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే డిసెంబర్ 31 కంటే ముందే ఆందోళనలు తీవ్రరూపం దాల్చనున్నాయనే చెప్పవచ్చు.
No comments:
Post a Comment