Wednesday, November 10, 2010

రైతు కన్నీరు

రైతు కన్నీరు
లక్షల ఎకరాల్లో పంట నష్టం
అధికారుల పర్యవేక్షణ కరువు...
అంచనాలు నామమాత్రం.. జాడ లేని నేతలు...

అంచనాలు నామమాత్రం.. జాడ లేని నేతలు...

నారు పోసినది మొదలు కుప్పనూర్చే వరకు.. రైతన్నకు కష్టం నష్టం.. చివరికి కన్నీరు.
మొన్నటివరకు కరువు.. నేడు వరుణుడి కాఠిన్యం. చేతికొచ్చినట్టె వచ్చి నేలపాలైన వరి ధాన్యం.. తెల్ల బంగారాన్నిచ్చే పత్తి చేను ఇక అక్కరకు రాకుందా.. ద్రుష్యాలు దయనీయం.. రైతు పరిస్థితి దైన్యం.

కరీంనగర్ జిల్లాలో కురిసిన వర్షాలకు పలు చోట్ల పత్తి, వరి పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. బెజ్జంకి మండలం లక్ష్మీపూర్, గూడెం, బేగంపేట, దాచారం, ముత్తన్నపేట, గన్నేరువరం గ్రామాల్లో వరి ధాన్యం నీట మునిగింది. ఇల్లంతకుంట మందలం రహీంకానిపేట, వెల్జాపూర్, ఆరెపల్లి, నర్సక్కపేట, కొత్తూరు లలో వరి, పత్తి చేలు దెబ్బతిన్నాయి. గంగాధర మండలంలో 20 వేల ఎకరాల పంట నేలపాలైంది. ఇదే పరిస్థితి జిల్లాలో పలు మండలాల్లో ఉంది. అలాగే సారంగాపూర్ మండలంలో కురిసిన వర్షాలకు దాదాపు 40 శాతం వరకు పంటలు నష్టపోయారు. అధికారులు సర్వే చేస్తున్నామని 15 రోజులనుండి చెబుతున్నప్పటికీ ఫలితం శూన్యం.  నేతలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మాటలవరకే పరిమితమయ్యారు. కాగా తమకు ప్రభుత్వపరంగా చేయూతనందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

No comments:

Post a Comment