Thursday, November 25, 2010

ఎ.పి. నూతన ముఖ్యమంత్రిగా కిరణ్

రాష్ట్ర 16 వ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి
      డా. రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత నుండి ఇంతవరకు ముఖ్యమంత్రిగా కొనసాగిన డా. కొణజేటి రోశయ్య అనూహ్యంగా బుధవారం పదవి నుండి తప్పుకున్నారు. దీనికి ప్రధాన కారణాలు ఏంటని మీడియా ప్రశ్నించగా వయోభారంతో పాటు పని ఒత్తిళ్ళు ఎక్కువవడంతో తప్పుకుంటున్నానని ఎలాంటి రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశించారు. కాగా తొలుత ఆయన ఉదయం 10 గంటలకే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా కార్యాలయ సిబ్బంది జాప్యం వల్ల మధ్యాహ్నం 12 .14 ని.లకు మారింది. ప్రమాణస్వీకార అనంతరం కిరణ్ ఢిల్లీ వెళ్లి అధినేత్రి ఆశీస్సులు తీసుకొని వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే చంద్రబాబుకు ప్రత్యర్థి కావడంతోనే కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని  రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ క్రమంలోనే  ఉప ముఖ్యమంత్రి పదవి అనే బీజం నాయకుల్లో నాటుకుంది. వెనకబడిన వర్గాలకు ఉన్నత స్థానం కల్పించే ఉద్దేశంతో ఆ పదవిని దళితులకు కేటాయించాలని, అదీ కూడా తెలంగాణాకు మద్దత్తిచ్చే వ్యక్తికే ఈ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణా ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకున్న నాయకులతోపాటు తెలంగాణా వాదులు కూడా చర్చించుకోవడంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇదిలా ఉండగా డిప్యూటి సి. ఎం. ఎవరనే మీమాంసలో సర్వత్రా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన నిర్యయాలనే తీసుకుంటుందని పార్టీ సీనియర్లు మరోసారి పునరుద్ఘాటించారు. ఈ విషయంలో దళితులకు, వెనుకబడిన వారికి సముచిత స్థానం కేటాయించాలని అధినేత్రి మదిలో ఉన్నట్లు స్పష్టమైంది. ఈరకంగా చూస్తే గీతారెడ్డికి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా కొత్తగా బాధ్యతలు చేపట్టిన కిరణ్ ప్రత్యేక తెలంగాణాకు ఎంతవరకు అనుకూలమో వేచి చూడాలి.

No comments:

Post a Comment