Tuesday, December 28, 2010

ఎట్టకేలకు దీక్ష విరమించిన ఎంపిలు

తెలంగాణా విద్యార్థులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపిలు దీక్ష చేపట్టిన విషయం విదితమే! రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిలో కొన్ని కేసులే ఎత్తేస్తాం అన్నీ అంటే కష్టమని చెబుతూ వచ్చారు. కానీ వారి దీక్ష ఇంకా ఉద్రుతమైతే చాలా ఇబ్బందులు ఎదురుతాయని భావించిన సర్కార్ దిగి వచ్చింది. ఎట్టకేలకు కాంగీ ఎంపిలు దీక్ష విరమించారు. అయితే విద్యార్థులపై కేసులన్నీ పూర్తిగా ఎత్తేసినందుకు ముఖ్యమంత్రిని కలిసి తమ కృతజ్ఞతలను తెలియజేశారు. 

Sunday, December 26, 2010

తెలంగాణా ఇవ్వకుంటే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం

కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు అల్టిమేటం జారీ చేశారు. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదిక తెలంగాణకు అనుకూలంగా లేకపోతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అవసరమైతే మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సైతం వెనుకాడబోమని వారు హెచ్చరించారు. ఇదే అంశంపై సోమవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడించనున్నట్టు ప్రకటించారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆదివారం భేటీ అయ్యారు. ఇందులో పలువురు నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేయాలనే ప్రతిపాదన పెట్టగా, దీనికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఫలితంగా డిసెంబరు 31వ తేదీ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మరింత గందరగోళంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా, విద్యార్థులు, ఉద్యమకారుల పెట్టిన కేసులను పూర్తిగా ఎత్తివేసే వరకు రేపటి నుంచి గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ఎంపీలంతా నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉదయం 11 గంటలకు సమావేశమైన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నేతలు తెలంగాణ అంశంపై మూడు గంటల పాటు విస్తృతంగా చర్చించారు. 

Wednesday, December 22, 2010

ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది

రైతన్న కంట తడిబెట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుమారుడు వై.ఎస్. జగన్ అన్నారు. రైతులు కన్నీరు పెట్టుకుంటే రాష్ట్రానికి అరిష్టమని రాజన్న చెప్పేవారని, అలాంటి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని జగన్ ధ్వజమెత్తారు.

రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని జగన్ నిప్పులు చెరిగారు. విజయవాడలోని కృష్ణాతీరంలోని వైఎస్సార్ ప్రాంగణం వేదిక నుంచి మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.

రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించడానికి ఇంకా ఎంత మంది రైతులు మరణించాలని జగన్ ప్రశ్నించారు. రైతును ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఆదుకుంటారని జగన్ అడిగారు. ఇంకా మూడేళ్ల సమయం ఉందనే అనుకుంటున్న ఈ ప్రభుత్వానికి డిపాజిట్లు దక్కవని జగన్ జోస్యం చెప్పారు.

ఉల్లి కోస్తే కాదు కొంటే కన్నీళ్ళే

దేశ వ్యాప్తంగా ఉల్లి కన్నీళ్ళు పెట్టిస్తోంది. వెల్లుల్లి భయపెట్టిస్తోంది. ధరల మంట జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రాష్ట్రంలో ఉల్లి ఎగుమతులు బాగా తగ్గాయి. ధరల తగ్గింపునకు ఏం చేయాలన్నదానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి.  సామాన్యుల విషయానికొస్తే ఉల్లి లేనిదే వంటలు చేయనివారు వీటిని కొనడానికి కాదు పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. ఈ ప్రకారంగా చూస్తే ఉల్లి కొస్తే కాదు కొంటే కన్నీరేనన్ని అనిపిస్తోంది. ఉల్లి ఎక్కువగా వచ్చే రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్ తో సహా దక్షినాది లోని మరి కొన్ని ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బ తిన్న కారణంగా తప్పని సరి పరిస్థితిలో ధరలు పెంచాల్సి వచ్చిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్ అన్నారు. మరో మూడు వారాల వరకు ఈ ధరలు భారంగానే ఉంటాయని వారన్నారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రధాని మన్మోహన్ రంగంలోకి దిగి వ్యవసాయ, వినియోగదారుల వ్యవహార శాఖలకు నిర్దిష్ట ఆదేశాలిచ్చారు. ధరల పరిస్థితిని రోజువారి ప్రాతిపదికన సమీక్షించాలని సూచించారు. దీనిలో భాగంగా సోమవారం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించారు. కాగా ధరల నియంత్రణలో సర్కారు విఫలమైందని విపక్షాలు మండిపడుతున్నారు.

Tuesday, December 14, 2010

మన ఎంపిలు దద్దమ్మలేనా?

రాష్ట్రంలో రైతు భారతం అస్తవ్యస్తమౌతోంది. మద్దతు ధర, దళారుల బెడద, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వీటికి తోడు నానాటికీ చుక్కలనంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యుని బతుకు చిద్రమౌతోంది. రాజకీయంగా రాష్ట్రానికి మేలు చేస్తామని చెప్పి ఢిల్లీకి వెళ్ళిన 32 మంది ఎంపిలు కినుక వహించడం సిగ్గుచేటు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కడానికి ప్రధాన కారణమైన మన ఎంపిలు మన రాష్ట్రం పట్ల వివక్ష చుపుతున్నప్పటికీ ప్రేక్షక పాత్ర వహించడం శోచనీయం. తడిసిన వారి ధాన్యానికి మద్దతు ధర ప్రకటిస్తామని కేంద్రం పక్క రాష్ట్రాల రైతులకు వరాలివ్వడం దారుణం. విపత్తులో ఉన్న రైతాంగానికి న్యాయం జరిగేలా పోరాడకపోతే భవిష్యత్తులో మన ఎంపిలు రైతుల ఆగ్రహానికి గురికాక  తప్పదు.

ఆంధ్రా పాలనలో తెలంగాణకు న్యాయం జరగదు: ఈటెల

ఈ ఆంధ్రా ప్రాంతానికి చెందిన పాలకుల పరిపాలనలో తెలంగాణ ప్రాంతానికి గానీ ఈ ప్రాంత విద్యార్థులకు గానీ ఎలాంటి న్యాయం జరగదని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. తెరాస సభ్యులు మంగళవారం అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత గన్‌పార్కుకు ర్యాలీగా వెళ్లారు.
అనంతరం గన్ పార్క్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని పార్టీలు విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని ముక్తకంఠంతో కోరినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజల గొంతు నొక్కే కుట్ర పన్నిందన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
గతంలో ఐపీఎస్ అధికారులపై అనేక దాడులకు పాల్పడ్డవారిపై కేసులు ఎత్తివేసిన ప్రభుత్వం విద్యార్థులపై మాత్రం కేసులు ఎత్తివేయడానికి మీనమేషాలు లెక్కిస్తుందన్నారు. 400 మంది విద్యార్థులను కోల్పోయి న్యాయం కోసం ఉద్యమించిన విద్యార్థులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. రంగా హత్య తర్వాత జరిగిన దమనకాండ నేరస్తులను ప్రభుత్వం వదిలి పెట్టిందని ఈటెల్ గుర్తు చేశారు.
అనంతరం తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ విద్యార్థులపై కేసులు ఎత్తివేయకుండా తమను శాసనసభ నుంచి బయటకు గెంటేశారన్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బయటకు వెళ్లి రఘువీరారెడ్డితో సస్పెన్షన్ ప్రకటన చేయించారని ఆయన మండిపడ్డారు. ఇకపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో తిరుగుతారని ఆయన ప్రశ్నించారు.

రాహుల్ ప్రధాని అయ్యేనా ?

అతి పెద్ద జాతీయ పార్టీగా ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం ముంచుకొస్తోంది. గాంధీల వారసత్వంగా భావించే ఈ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుందా. రాజీవ్ గాంధీ తరువాత సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని పక్కనబెట్టి దేశ కాంగ్రెస్ రాజకీయాలపై మంచి పట్టు సాధించారు. ఈస్ట్ అఫ్ ది ఇటాలియన్ కాదు బాస్ అఫ్ ది కాంగ్రెస్ అనిపించుకున్నారు. కానీ బీహార్ లో ఎన్నికల తరువాత ఆమెలో అంతర్మథనం మొదలైంది. రాహుల్ గాంధీ చేసిన ప్రచారం బీహార్ లో పనిచేయలేదు. మన రాష్ట్రంలో జగన్ ను పక్కన పెట్టి అధిష్ఠానం చేయి కాల్చుకుంది. దీనికి తోడు కుంభకోణాలు, తెలంగాణా అంశం, అనేక సామాజిక సమస్యలు కాంగ్రెస్ మనుగడను దెబ్బ తీస్తున్నాయి. కాంగ్రెస్ అధికారం లో ఉన్న ఏకైక పెద్ద రాష్ట్రం మనదే ఇక్కడ కూడా అధిష్ఠానం చేసిన అనేక తప్పిదాల వల్ల మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 లో  రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని పార్టీ అగ్ర శ్రేణి నాయకులతోపాటు ముఖ్యమంత్రులు చేసిన ప్రతిజ్ఞలు తారుమారయ్యే పరిస్థితులు  పుష్కలంగా ఉన్నాయి. 2014 సంగతి దేవుడెరుగు మధ్యంతరం రాకుండా చూసుకుంటే మంచిదని పరిశీలకులు అంటున్నారు.

Sunday, December 12, 2010

హస్తం అస్తవ్యస్తం ... అంతర్మథనంలో అధిష్ఠానం?

రైతు సంక్షేమం పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి మరణాంతరం రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసింది. సొంతింటిని చక్కదిద్దుకోవడంలో తలమునకలౌతోంది. ముఖ్యమంత్రులను నియమించడం, మంత్రి మండలిని ఏర్పాటు చేయడం, బెర్తుల కేటాయింపు, జగన్ ను బయటకు పంపడం, కాంగ్రెస్ నాయకత్వాన్ని ఢిల్లీ చుట్టూ తిప్పుకోవడంలో అధిష్ఠానం పూర్తిగా పట్టు సాధించింది.  దీంతో రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోవడంతో అనేక సమస్యలతో ప్రజలు రోడ్డెక్కారు. కొత్తగా వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్నా, అధిష్ఠానం మార్క్ తోనే ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి పాలన యంత్రాంగంపై పూర్తిగా పట్టు సాధించి ప్రజా సమస్యలను ఒక గాడిలో పెడదామనే ఆలోచన ఉన్నా ప్రతిదానికీ ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. పార్టీ నుండి బయటకు వచ్చిన జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కొత్త పార్టీ ని ప్రకటిస్తాననడంతో జగన్ వర్గంలో ఉత్సాహం కట్టలు తెంచుకుంది. రైతు పరామర్శ యాత్రలో భాగంగా కృష్ణ జిల్లాలో పర్యటించారు. ఇప్పటికే బందర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పెర్నేని నానితో సహా పలువురు శాసన సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జడ్పిటిసిలు జగన్ వర్గంలో చేరిపోయారు. విజయవాడ ప్రథమ, ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా ఇదే బాటలో పయనిస్తుండడంతో కృష్ణా జిల్లాలో 80 శాతం కాంగ్రెస్ నాయకత్వం ఖాళీ అయింది. విజయవాడ ఎంపి లగడపాటి అనుచరుడు గౌతమ్ రెడ్డి కూడా జగన్ ను కలవడంతో సిఎం కిరణ్ లగడపాటిని రంగంలోకి దించి ప్రస్తుత పరిణామాలపై దృష్టి పెట్టమని ఆదేశించారు. జగన్ తొలి రోజు పర్యటనకే ఇంత స్పందన ఉంటే అన్ని జిల్లాల్లో పర్యటిస్తే రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ప్రశ్నార్థకమేనని పరిశీలకులు భావిస్తున్నారు. జగన్ వెంట ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకో 20 మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడం ఆయనకు పెద్ద సమస్యేం కాదు. 155 మంది ఎమ్మెల్యేలతో ఏర్పడ్డ ప్రభుత్వం 40 -50 మంది జగన్ వర్గంలో చేరితే ప్రభుత్వ మనుగడకు ముప్పు వాటిల్లే అవకాశముంది. తన తండ్రి కృషితో ఏర్పడ్డ ప్రభుత్వాన్ని ఏనాడు కూల్చే ప్రయత్నం చేయనని జగన్ ప్రకటించారు. కానీ రైతు పరామర్శ యాత్రలో ప్రభుత్వానికి కాలం చెల్లిందని పదే పదే అనడం జగన్ ఆలోచనల్లో మార్పు స్పష్టంగా కనబడుతోంది. కడప, పులివందుల ఉప ఎన్నికల అనంతరం జగన్ అనుసరించే వ్యుహాలేమిటో తలుచుకుంటేనే అధిష్ఠానం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

తెలంగాణా విషయంలో తాత్సారం తగదు - చుక్కా రామయ్య

తెలంగాణా విషయంలో తాత్సారం తగదని డిసెంబర్ 9 న కేంద్ర ప్రభుత్వం తెలంగాణా రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమయిందని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని విద్యావేత్త చుక్కా రామయ్య కేంద్రాన్ని కోరారు. వరంగల్ జిల్లా మద్దూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీతో సంబంధం లేకుండా తెలంగాణాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
 
 
 

Saturday, December 11, 2010

కేసులు ఎత్తివేయటం అంత సులభం కాదు ... సిఎం

విద్యార్థులపై నమోదు చేసిన కేసుల ఎత్తివేత విషయంలో ప్రభుత్వం కొన్ని పద్ధతులు, ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఆయన ప్రతిపక్ష సభ్యులు చేసిన డిమాండ్‌పై స్పందించారు.
కేసుల ఎత్తివేత విషయంలో న్యాయసలహాలు కూడా తప్పక తీసుకోవాల్సి ఉందన్నారు. లేకుంటే ప్రభుత్వానికి కోర్టుల్లో చుక్కెదురు అవుతుందన్నారు. అలాగే మత కలహాల సందర్భంగా ముస్లిం యువకులపై ఉన్న కేసుల ఎత్తివేత అంశాన్ని సోమవారం సభలో చర్చిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
అయితే, ముఖ్యమంత్రి వివరణను తెరాస, భాజపా, తెలుగుదేశం తెలంగాణ ఫోరం, ఎంఐఎం సభ్యులు వ్యతిరేకించారు. ఇదిలావుండగా, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ఉద్యమకారులపై కేసులు నమోదు చేస్తామని  చెప్పారు.

Tuesday, December 7, 2010

sÃXøjáT« VŸ²jáÖ+ýË n~ócÍ÷H"¿ì È>·HŽ dŸeTdŸ« ÿ¿£Øfñ....È>·HŽ kõ+Ôá Å£"+|Ÿ{ì ™|³T¼Å£"+{²q+³Ö bͯ¼¿ì sJHeÖ #ûjáT&ƒ+Ôà ndŸ+Ôá|Ÿï HûÔá\T €jáTq |Ÿ+#áq #û¹s ne¿±Xæ\™|Õ n~ócÍ÷q+ dÓ]jáTdt>± <Šw¾¼ kÍ]+º+~. ¿ìsÁDYÅ£"eÖsYÂs&¦ ¹¿_Hî{٠ţLsÁTΙ|Õ ¿£dŸsÁÔáTï #ûdŸÖïHû ndŸ+Ôá|ŸÚï\T È>·HŽ |Ÿ+#áq #û]Ôû ç|Ÿuó„TԐÇ"• "\uɳT¼¿Ãe&ƒ+ mý² nq• <‘"™|ÕH #ásÁÌ\T È]|¾+~. nedŸsÁyîT®Ôû ç|ŸC²sÈ«+ bͯ¼¿ì ¹¿_Hî{ÙýË kÍœq+ ¿£*Î+º È>·HŽ esZ"• <î‹Ò¿={²¼\" jîÖº+º+~. € <óîÕsÁ«+ÔÃHû eT+çÜesÁZ+ýË È>·HŽ $<óûjáTT\Å£" #óq•<û ýñ¿£+&† #ûd¾+~. nsTTÔû MsÁ $<óûjáTT\qTÅ£"q• dÓ"jáT¹s¢ uÉsYï\ ¹¿{²sTT+|ŸÚ $wŸjáT+ýË uɳT¼ #ûjáT&ƒ+Ôà n~ócÍ÷q+ ~eTˆÜ]Ð+~. &™d+‹sY 31 <Š>·ZsÁ |Ÿ&ƒTÔáTq• ¿=BÝ sçwŸ¼+ýË sÈ¿¡jáT n"¥ÌÜ".....sÁÖ|ŸÚeÖ|¾ m³Te+{ì |Ÿ]d¾œÜHîÕH m<ŠTs=ØHû+<ŠTÅ£" M\T>± sjáT\dÓeT¹¿ #î+~q È>·HŽ kÍeÖ›¿£esÁZ+ HjáTÅ£"&îÕq qý²¢] ¿ìsÁDYÅ£"eÖsYÂs&¦" @]¿Ã] d¾m+ |ÓsÄÁ+™|Õ Å£LsÃÌ™|{ì¼+~. nsTTÔû ¿ìsÁDYÅ£"eÖsYÂs&¦¿ì yîÕmdt eT+çÜesÁZ+Ôà |Ÿ" #ûsTT+#áT¿Ãe&ƒ+ @eÖçÔá+‚wŸ¼+ ýñ¿£bþe&ƒ+ e\¢ eT+çÜesÁZ+ýË" dŸuó„T«\ XæK\qT <‘<‘|ŸÚ>± eÖ]ÌyûXæsÁT. ÔáqÅ£" qeTˆ¿£dŸTïýÉÕq y]¿ì çbÍ<ó‘q«Ôá ¿£*Ðq XæK\qT ¹¿{²sTT+º kõ+Ôá ȳT¼qT @sÁÎsÁT#áTÅ£"H•sÁ" dÓ"jáTsÁT¢ uó²$+#sÁT. sçwŸ¼ #á]çÔáýË ¿±+çÂ>dt bͯ¼ eTTK«eT+çÔáT\qT eÖsÁÌ&ƒ+ dŸVŸ²ÈyûT nsTTq|ŸÎ{ì¿¡ ‚+Ôá ™|<ŠÝ mÔáTïq XæK\qT eÖ]Ìq dŸ+|˜ŸT³q\T >·Ôá+ýË mq•&ƒÖ ýñe" sÈ¿¡jáT |Ÿ]o\Å£"\T #î‹TÔáTH•sÁT. n+Ôû ¿±Å£"+&† C²rjáT bͯ¼ nsTTq ¿±+çÂ>dtýË n+ÔásÁZÔá ç|ŸC²kÍÇeT«+ yîÖԐ<ŠT ¿±dŸï mÅ£"Øyû ¿±‹{ì¼ dŸeTÖ\+>± XæK\qT eÖ]dï ¿=]$Ôà Ôá\>ÃÅ£"Øq•fñ¢ neÚÔáT+<Š" Ôá\|Ÿ+&q eTTK«eT+çÔáT\T ™dÕÔá+ € <óîÕsÁ«+ #ûjáTýñ¿£bþjáÖsÁT. nsTTÔû ¹¿e\+ myîTˆýñ«, N|˜t $|t, dŸuó²|ŸÜ>± ¿=~Ý sÃE\T eÖçÔáyûT |Ÿ" #ûd¾q ¿ìsÁDYÅ£" bÍ\H nqTuó„+ @eÖçÔá+ ýñ¿£bþe&ƒ+ e\¢Hû dÓ"jáTsY\ XæK\T dŸeTÖ\+>± eÖ]Ì ‚‹Ò+<ŠT\qT ¿="Ôî#áTÌÅ£"H•sÁT.
n~ócÍ÷q+ CË¿£«+Ôà ԐԐØ*¿£+>± ‚‹Ò+<ŠT\T Ô=\Ðq³T¢ ¿£"|¾+ºH uó„$wŸ«ÔáTïýË eÖçÔá+ eT]"• Ôá\H=|ŸÚÎ\T Ôá|ŸÎeq• dŸ+¹¿Ôá+¿ìsÁDYÅ£" ‡ dŸ+|˜ŸT³qÔà ne>·ÔáyîT® –+³T+~.

Monday, December 6, 2010

కాళేశ్వరానికి పుష్కర శోభ

 
ప్రాణహిత నదీ పుష్కరాలు  ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు ప్రాణహిత పుష్కరాలను ప్రారంభించారు.  కాగా పవిత్ర నదీ స్నానం చేయడానికి దేశం నలుమూలల నుండి ఈ క్షేత్రానికి చేరుకొని పవిత్ర స్నానాలు ఆచరించి, ముక్కంటిని దర్శించి మొక్కులు తీర్చుకొని తరించారు. నదీ ప్రాంతం తో పాటు, దేవాలయం కూడా శివనామ స్మరణతో మారుమోగింది. అయితే పుష్కరం అంటే 12  సంవత్సరాలని అర్థం. ప్రతి ఏడాది ఒక్కో నదికి పుష్కరాలు వస్తుంటాయి. ఆయా నదుల్లో ముక్కోటి దేవుళ్ళు సైతం స్నానాలాచారించి తరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంత మహిమ ఉన్న ఈ పుష్కరాలు ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వస్తాయి. ఇలా ఈ ఏడాది ప్రాణహిత నదికి రావడంతో  భక్తులు అధిక సంఖ్యలో ఈ ప్రాంతానికి విచ్చేయడంతో జాతర వాతావరణాన్ని తలపించింది. దేవాలయం వారు భక్తుల సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకున్నా అవి ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో అక్కడక్కడ భక్తులు అసౌకర్యానికి గురయ్యారు.

Friday, December 3, 2010

మంత్రి ఇలాకాలో మావోల కదలికలు

సి ఎం పర్యటనపై ఉత్కంఠత
పోలీసులు  నల్లమల అడవులపైనే ఇప్పటివరకు దృష్టి కేంద్రీకరించారు. పోలీసులు అడవులపై పూర్తి పట్టు సాధించే దిశగా అడుగులేస్తున్న ఈ దశలో పోలీసుల దిశను మార్చేందుకు తెలంగాణా జిల్లాల్లో తమ ఉనికి చాటుకునేందుకు కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఇరువురిని హతమార్చినట్లు తెలుస్తుంది. మంత్రి శ్రీధర్ బాబు ఇలాకాలో ఇన్ఫార్మర్ నెపంతో హతమార్చడం రాజకీయ నేతల్లో ముఖ్యంగా అధికార పార్టీ నేతల్లో గుబులు రేకెత్తిస్తోంది. గత కొద్ది కాలంగా స్తబ్దతతో ఉన్న ఈ ప్రాంతం గురువారం అర్ధ రాత్రి జరిగిన సంఘటనతో ఉలిక్కిపడింది మంత్రిగా పదవీ స్వీకారం చేసి, నియోజకవర్గానికి రాకముందే ఈ సంఘటన జరగడం పట్ల పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ప్రాణహిత పుష్కరాలు ఈనెల 6 నుండి ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం లోని పుష్కర ఘాట్ వద్ద కొత్త సి ఎం కిరణ్ పుష్కరాలను ప్రారంభించనున్నందున పోలీసులు ప్రత్యేక బలగాలతో తనీఖీలు ముమ్మరం చేసారు. మావోలు హతమార్చిన మహదేవ్ పూర్ లోనే సి ఎం పర్యటన ఉండడంతో పోలీసులు సవాల్ గా తీసుకునే అవకాశాలున్నాయి. పోలీసుల టార్గెట్ లో ఉన్నవారు, పరిసర ప్రాంతాల ప్రజలు ఎప్పుడూ ఎం జరుగుతుందో అని బిక్కు బిక్కుమంటున్నారు. అదే విధంగా ఏటూరు నాగారం మండలంలో మూడు గ్రామాల్లో మావోయిస్టులు సంచరించి ఒకరిని హతమార్చి, ముగ్గురిని కిడ్నాప్ చేయడం, బస్సును దహనం చేయడం మహాదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి పేరుతొ లేఖను వదిలి వెళ్ళడం చర్చనీయాంశం అయింది. రెండు చోట్ల ఒకే దళం సంచరించింది! అడుగడుగునా పోలీసుల డేగ కళ్ళను తప్పించుకున్న మావోలు ఇటువంటి సంఘటనలకు పాల్పడడం విస్మయం కలిగిస్తుంది.

Thursday, December 2, 2010

స్తంభించిన పాలన

ఎక్కడి సమస్యలు అక్కడే
ఆందోళనలు, అసంతృప్తి, వేరు కుంపట్లు
ప్రభుత్వాలు, అధికారుల మార్పు, ఆందోళనలు, బుజ్జగింపులు... ఇలా కాలం గడుస్తూనే ఉంది. తమ సమస్యలు ఇకనైనా పరిష్కారమవుతాయని బాధితులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. గత రెండేళ్ళ పరిణామాలను పరికిస్తే... దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ మరణానంతరం నుండి ఇప్పటి వరకు అన్ని అపశకునాలే రోశయ్య ప్రభుత్వం ముందుకెళ్ళలేక, కీలక నిర్ణయాలు తీసుకోలేకపోయారు. తెలంగాణా ఉద్యమ ఉధృతి గత సంవత్సరం నవంబర్ చివరి వారం నుండి 2009 డిసెంబర్ కేంద్ర ప్రభుత్వ ప్రకటన, తదుపరి సీమాంధ్రలో ఆందోళనలు, శ్రీ కృష్ణ కమిటీ ఏర్పాటుకు దారి తీసిన విషయం తెలిసిందే ముఖ్య మంత్రిగా రోశయ్య 14 నెలల 22 రోజులైనా ఆయనకు జగన్ వైఖరి తలనొప్పికి గురి చేసింది. ఒకవైపు ఆర్ధిక లోటు, మరోవైపు సంక్షేమాలకు సర్దుబాటు, ఆందోళనలు... రోశయ్యను ఉక్కిరి బిక్కిరి చేసింది. చివరకు రాజీనామాకు దారి తీసేలా చేశాయి. డిసెంబర్ 31 జ్వరం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను శృతి మించుతున్న జగన్ వర్గాన్ని కట్టడి చేయడానికి ముఖ్యమంత్రి మార్పు అనివార్యమైంది. సమర్థత గల ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి అన్ని సమస్యలను పరిష్కరిస్తారని భావించి కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు సిఎం పదవిని కట్టబెట్టింది. అయితే ఆదిలోనే హంసపాదులా జగన్, జయమ్మల రాజీనామాలు, మంత్రి పదవుల కేటాయింపులో సీనియర్ల అసంతృప్తి రాజుకుంది. పరిపాలన దిశగా ముందుకెళ్ళే వాతావరణాన్ని నెలకొల్పుకునేందుకు సిఎం గా బాధ్యతలు చేపట్టిన మొదటగా తనకు అనుకూలంగా అధికారులను మార్చుకున్నారు. తొలి మంత్రివర్గ భేటీ గురువారం ఏర్పాటు చేసి, కీలక నిర్ణయాలు తీసుకుంటారని భావించినా ఆశించినట్లు ఫలితాలు ఉండకపోవచ్చు. ఇందిరమ్మ, ఆరోగ్యశ్రీ లాంటి అనేక పథకాలు, నిధుల లేమి ఇతరత్రా కారణాలచే ప్రస్తుతం సత్ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ఆ దిశగా అడుగులేసే ఈ తరుణంలో మంత్రుల అసంతృప్తితోపాటు జగన్ కొత్త పార్టీ ప్రధాన సమస్యలుగా మారాయి. వీటిపై దృష్టి పెట్టి ప్రజల సమస్యలను పక్కన పెట్టే అవకాశాలున్నాయి.




Wednesday, December 1, 2010

అప్పుడే ముసలం

శాఖల పేచీ
వట్టి రాజీనామా
బొత్స గుర్రు
దిగి వచ్చిన అధిష్టానం
కిరణ్ మంత్రి వర్గంలో అప్పుడే ముసలం మొదలైంది. మంత్రుల శాఖల కేటాయింపుపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాధాన్యత లేని శాఖలు తమకు కేటాయించారని మంత్రి బోత్సాతో సహా 15 మంది మంత్రులు అసంతృప్తి వెళ్లగక్కారు. ప.గో. కు చెందిన వట్టి వసంత కుమార్ తనకు పర్యాటక, సాంస్కృతిక శాఖలు కేటాయించడం పట్ల పదవీ స్వీకారం చేసి, ఒక రోజు గడవక ముందే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే వేదంగా మంత్రి వర్గంలో పెద్దన్న పాత్ర పోషించే విజయనగరం జిల్లాకు చెందిన  బొత్సా సత్యనారాయణ రవాణా శాఖ కేటాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్య మంత్రి పదవి ఇస్తానన్న దామోదర రాజనరసింహకు ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ కేటాయించి మొండి చేయి చూపారని ఆయన వర్గీయులు విమర్శలు గుప్పించారు. అయితే తెలంగాణా జిల్లాలకు చెందిన మంత్రులు తొలుత అసంతృప్తిలో ఉన్నా జగన్ కు ఇది లాభిస్తుందనే కోణంతో ఆలోచించి ఉన్న శాఖలతో సర్దుకు పోదామని ప్రకటించారు. బొత్సా మాత్రం ఎత్తి పరిస్థితుల్లో కూడా తానూ ఊరుకునేది లేదని తెగేసి చెప్పడంతో కాంగ్రెస్ రాష్ట వ్యవహారాల ఇంచార్జి వీరప్ప మొయిలీ, ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్ లు రంగంలోకి దిగారు. ఫోన్ ద్వారా బొత్సాను బుజ్జగించే యత్నం చేశారు. గురువారం మధ్యాహ్నం జరిగే మంత్రి వర్గ తొలి భేటీకి తాము హాజరు కాబోమని సీనియర్ మంత్రులు చెప్పడం ఒకింత ఉత్కంఠకు దారి తీసింది. మంత్రి వర్గాల కేటాయింపులో మాజీ శాసన సభ స్పీకర్ సురేష్ రెడ్డి సూచనలు కిరణ్ తీసుకుని, ఇప్పటి నుండే తన వర్గం అనే ముద్ర వేసుకున్నారని పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఆరోపిస్తున్నారు.


జగన్ కొత్త పార్టీ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ ?

మద్దతు దారులతో సమాలోచనలు
జిల్లాల వారీగా సర్వే
దివంగత వై ఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీకి వ్యూహ రచన చేసినట్లు సమాచారం. కొత్త పార్టీ పేరు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ గా నామకరణం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కడప లోక్ సభ స్థానానికి, కాంగ్రెస్ పార్టీకి పులివెందుల శాసన సభ్యురాలైన జయమ్మ సహా రాజీనామా చేసిన విషయం తెలిసిందే! మంత్రి వర్గ విస్తరణకు ముందు, తర్వాత రాజకీయ పరిణామాలు మద్దతుదారుల అభిప్రాయాల మేరకు కొత్త పార్టీకి శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. ఇడుపులపాయలో వై ఎస్ ఆర్ కు అభిమానుల మధ్య జగన్, కుటుంబ సభ్యులు నివాళులు అర్పించిన తరువాత కొత్త పార్టీ నిర్మాణం, రాజకీయ భవిష్యత్ పై పలువురితో ఆయన సమాలోచనలు జరిపినట్లు తెలుస్తుంది. మంత్రి పదవి దక్కని వారు, ఆది నుండి జగన్ టో అనుబంధం ఉన్నవారు ఆయన పెట్టే పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయి. కడప, అనంతపురం, శ్రీకాకుళం... తదితర సీమాంధ్ర జిల్లాల నుండే కాకుండా తెలంగాణా జిల్లాల నుండి కూడా జగన్ పార్టీలోకి ప్రజా ప్రతినిధులు, అభిమానులు చేరే అవకాశాలున్నాయి. జగన్ తెలంగాణా ఏర్పాటు పై తొలుత అడ్డు తగిలినా తరువాత పరిణామాల నేపథ్యంలో ఎటువంటి ప్రకటనలు చేయలేదు. తెలంగాణాకు జగన్ వ్యతిరేకం కాదని వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కొండా సురేఖ పలు సందర్భాల్లో ప్రకటించారు. వరంగల్ జిల్లా నుండి జగన్ కు మద్దతు తెలిపే వారిలో ఆమెతో పాటు ఎమ్మెల్యే మాలోతు కవిత, ఎమ్మెల్సీ పద్మావతి సహా ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు జగన్ పార్టీలోకి వలస వెళ్ళే అవకాశాలున్నాయి. కిరణ్ ప్రభుత్వాన్ని మైనార్టీలోకి నెట్టడానికి 20 మందికి పైగా ఎమ్మెల్యేలను లాగాలి. అయితే ఇప్పటికే కిరణ్ జగన్ వర్గంలోకి ఎవరెవరు, ఎంత మంది వేల్లనున్నారనే దానిపై అధ్యయనం చేసినట్లు తెలుస్తుంది. అందుకు కాంగ్రెస్ అధినేత్రి పిఆర్పీని ముందస్తుగా ఉంచారు.

అధిష్టాన సంకేతం

 జగన్ వర్గం పై వేటు
భవిష్యత్ తరాలకు సూచిక
ఎట్టకేలకు సి.ఎం. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గం బుధవారం పదవీ స్వీకారం చేసింది. గత కొద్ది రోజుల నాటకీయ పరిణామాలకు తెర తొలగింది. అధిష్టాన మాట వినని వారికి వేటు తప్పదని సోనియా చెప్పకనే చెప్పినట్టైంది. ప్రధానంగా జగన్ వర్గంగా ముద్ర పడ్డ మంత్రులు సుభాష్ చంద్రబోస్, బల్నేని సహా ఐదుగురికి మొండి చేయి చూపించి, భవిష్యత్ లో క్రమశిక్షణా రాహిత్యాన్ని ప్రదర్శిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో అధిష్టానం దీని ద్వారా సూచించింది. వై ఎస్ పాద యాత్ర ద్వారా జనం ముఖ్యమంత్రిగా వెలుగొందంగా అదే బాటలో ఓదార్పు ద్వారా ప్రజలకు చేరువవ్వాలని అధిష్టాన మాట వినక వివిధ పద్ధతుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ అధినాయకత్వం పై విమర్శలు చేసిన జగన్ ను ఒంటరి చేసే యత్నంలో సోనియా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ మద్దతు దారులైన ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామాలు చేస్తే ప్రజారాజ్యం శాసన సభ్యులు మద్దతు ఇవ్వడానికి ముందస్తు ప్రయత్నాలు కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంది. పిఆర్పీ అధినేత తో ఓ ప్రకటన ఇచ్చేటట్లు చేసింది. జగన్ వర్గం నుండి ఎంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారనే దాన్ని బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునేటట్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముఖ్యమంత్రి కిరణ్ తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడే పక్షంలో వెంటనే పిఆర్పీ ఎమ్మెల్యేల మద్దతు తీసుకునే అవకాశాలున్నాయి. అందుకు ఆ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి, లేదా నలుగురికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలున్నాయి.