Saturday, December 11, 2010

కేసులు ఎత్తివేయటం అంత సులభం కాదు ... సిఎం

విద్యార్థులపై నమోదు చేసిన కేసుల ఎత్తివేత విషయంలో ప్రభుత్వం కొన్ని పద్ధతులు, ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఆయన ప్రతిపక్ష సభ్యులు చేసిన డిమాండ్‌పై స్పందించారు.
కేసుల ఎత్తివేత విషయంలో న్యాయసలహాలు కూడా తప్పక తీసుకోవాల్సి ఉందన్నారు. లేకుంటే ప్రభుత్వానికి కోర్టుల్లో చుక్కెదురు అవుతుందన్నారు. అలాగే మత కలహాల సందర్భంగా ముస్లిం యువకులపై ఉన్న కేసుల ఎత్తివేత అంశాన్ని సోమవారం సభలో చర్చిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
అయితే, ముఖ్యమంత్రి వివరణను తెరాస, భాజపా, తెలుగుదేశం తెలంగాణ ఫోరం, ఎంఐఎం సభ్యులు వ్యతిరేకించారు. ఇదిలావుండగా, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ఉద్యమకారులపై కేసులు నమోదు చేస్తామని  చెప్పారు.

No comments:

Post a Comment