ప్రాణహిత నదీ పుష్కరాలు ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు ప్రాణహిత పుష్కరాలను ప్రారంభించారు. కాగా పవిత్ర నదీ స్నానం చేయడానికి దేశం నలుమూలల నుండి ఈ క్షేత్రానికి చేరుకొని పవిత్ర స్నానాలు ఆచరించి, ముక్కంటిని దర్శించి మొక్కులు తీర్చుకొని తరించారు. నదీ ప్రాంతం తో పాటు, దేవాలయం కూడా శివనామ స్మరణతో మారుమోగింది. అయితే పుష్కరం అంటే 12 సంవత్సరాలని అర్థం. ప్రతి ఏడాది ఒక్కో నదికి పుష్కరాలు వస్తుంటాయి. ఆయా నదుల్లో ముక్కోటి దేవుళ్ళు సైతం స్నానాలాచారించి తరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంత మహిమ ఉన్న ఈ పుష్కరాలు ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వస్తాయి. ఇలా ఈ ఏడాది ప్రాణహిత నదికి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఈ ప్రాంతానికి విచ్చేయడంతో జాతర వాతావరణాన్ని తలపించింది. దేవాలయం వారు భక్తుల సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకున్నా అవి ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో అక్కడక్కడ భక్తులు అసౌకర్యానికి గురయ్యారు.
No comments:
Post a Comment