Thursday, December 2, 2010

స్తంభించిన పాలన

ఎక్కడి సమస్యలు అక్కడే
ఆందోళనలు, అసంతృప్తి, వేరు కుంపట్లు
ప్రభుత్వాలు, అధికారుల మార్పు, ఆందోళనలు, బుజ్జగింపులు... ఇలా కాలం గడుస్తూనే ఉంది. తమ సమస్యలు ఇకనైనా పరిష్కారమవుతాయని బాధితులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. గత రెండేళ్ళ పరిణామాలను పరికిస్తే... దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ మరణానంతరం నుండి ఇప్పటి వరకు అన్ని అపశకునాలే రోశయ్య ప్రభుత్వం ముందుకెళ్ళలేక, కీలక నిర్ణయాలు తీసుకోలేకపోయారు. తెలంగాణా ఉద్యమ ఉధృతి గత సంవత్సరం నవంబర్ చివరి వారం నుండి 2009 డిసెంబర్ కేంద్ర ప్రభుత్వ ప్రకటన, తదుపరి సీమాంధ్రలో ఆందోళనలు, శ్రీ కృష్ణ కమిటీ ఏర్పాటుకు దారి తీసిన విషయం తెలిసిందే ముఖ్య మంత్రిగా రోశయ్య 14 నెలల 22 రోజులైనా ఆయనకు జగన్ వైఖరి తలనొప్పికి గురి చేసింది. ఒకవైపు ఆర్ధిక లోటు, మరోవైపు సంక్షేమాలకు సర్దుబాటు, ఆందోళనలు... రోశయ్యను ఉక్కిరి బిక్కిరి చేసింది. చివరకు రాజీనామాకు దారి తీసేలా చేశాయి. డిసెంబర్ 31 జ్వరం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను శృతి మించుతున్న జగన్ వర్గాన్ని కట్టడి చేయడానికి ముఖ్యమంత్రి మార్పు అనివార్యమైంది. సమర్థత గల ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి అన్ని సమస్యలను పరిష్కరిస్తారని భావించి కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు సిఎం పదవిని కట్టబెట్టింది. అయితే ఆదిలోనే హంసపాదులా జగన్, జయమ్మల రాజీనామాలు, మంత్రి పదవుల కేటాయింపులో సీనియర్ల అసంతృప్తి రాజుకుంది. పరిపాలన దిశగా ముందుకెళ్ళే వాతావరణాన్ని నెలకొల్పుకునేందుకు సిఎం గా బాధ్యతలు చేపట్టిన మొదటగా తనకు అనుకూలంగా అధికారులను మార్చుకున్నారు. తొలి మంత్రివర్గ భేటీ గురువారం ఏర్పాటు చేసి, కీలక నిర్ణయాలు తీసుకుంటారని భావించినా ఆశించినట్లు ఫలితాలు ఉండకపోవచ్చు. ఇందిరమ్మ, ఆరోగ్యశ్రీ లాంటి అనేక పథకాలు, నిధుల లేమి ఇతరత్రా కారణాలచే ప్రస్తుతం సత్ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ఆ దిశగా అడుగులేసే ఈ తరుణంలో మంత్రుల అసంతృప్తితోపాటు జగన్ కొత్త పార్టీ ప్రధాన సమస్యలుగా మారాయి. వీటిపై దృష్టి పెట్టి ప్రజల సమస్యలను పక్కన పెట్టే అవకాశాలున్నాయి.




No comments:

Post a Comment