శాఖల పేచీ
వట్టి రాజీనామా
బొత్స గుర్రు
దిగి వచ్చిన అధిష్టానం
కిరణ్ మంత్రి వర్గంలో అప్పుడే ముసలం మొదలైంది. మంత్రుల శాఖల కేటాయింపుపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాధాన్యత లేని శాఖలు తమకు కేటాయించారని మంత్రి బోత్సాతో సహా 15 మంది మంత్రులు అసంతృప్తి వెళ్లగక్కారు. ప.గో. కు చెందిన వట్టి వసంత కుమార్ తనకు పర్యాటక, సాంస్కృతిక శాఖలు కేటాయించడం పట్ల పదవీ స్వీకారం చేసి, ఒక రోజు గడవక ముందే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే వేదంగా మంత్రి వర్గంలో పెద్దన్న పాత్ర పోషించే విజయనగరం జిల్లాకు చెందిన బొత్సా సత్యనారాయణ రవాణా శాఖ కేటాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్య మంత్రి పదవి ఇస్తానన్న దామోదర రాజనరసింహకు ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ కేటాయించి మొండి చేయి చూపారని ఆయన వర్గీయులు విమర్శలు గుప్పించారు. అయితే తెలంగాణా జిల్లాలకు చెందిన మంత్రులు తొలుత అసంతృప్తిలో ఉన్నా జగన్ కు ఇది లాభిస్తుందనే కోణంతో ఆలోచించి ఉన్న శాఖలతో సర్దుకు పోదామని ప్రకటించారు. బొత్సా మాత్రం ఎత్తి పరిస్థితుల్లో కూడా తానూ ఊరుకునేది లేదని తెగేసి చెప్పడంతో కాంగ్రెస్ రాష్ట వ్యవహారాల ఇంచార్జి వీరప్ప మొయిలీ, ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్ లు రంగంలోకి దిగారు. ఫోన్ ద్వారా బొత్సాను బుజ్జగించే యత్నం చేశారు. గురువారం మధ్యాహ్నం జరిగే మంత్రి వర్గ తొలి భేటీకి తాము హాజరు కాబోమని సీనియర్ మంత్రులు చెప్పడం ఒకింత ఉత్కంఠకు దారి తీసింది. మంత్రి వర్గాల కేటాయింపులో మాజీ శాసన సభ స్పీకర్ సురేష్ రెడ్డి సూచనలు కిరణ్ తీసుకుని, ఇప్పటి నుండే తన వర్గం అనే ముద్ర వేసుకున్నారని పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఆరోపిస్తున్నారు.
No comments:
Post a Comment