Friday, December 3, 2010

మంత్రి ఇలాకాలో మావోల కదలికలు

సి ఎం పర్యటనపై ఉత్కంఠత
పోలీసులు  నల్లమల అడవులపైనే ఇప్పటివరకు దృష్టి కేంద్రీకరించారు. పోలీసులు అడవులపై పూర్తి పట్టు సాధించే దిశగా అడుగులేస్తున్న ఈ దశలో పోలీసుల దిశను మార్చేందుకు తెలంగాణా జిల్లాల్లో తమ ఉనికి చాటుకునేందుకు కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఇరువురిని హతమార్చినట్లు తెలుస్తుంది. మంత్రి శ్రీధర్ బాబు ఇలాకాలో ఇన్ఫార్మర్ నెపంతో హతమార్చడం రాజకీయ నేతల్లో ముఖ్యంగా అధికార పార్టీ నేతల్లో గుబులు రేకెత్తిస్తోంది. గత కొద్ది కాలంగా స్తబ్దతతో ఉన్న ఈ ప్రాంతం గురువారం అర్ధ రాత్రి జరిగిన సంఘటనతో ఉలిక్కిపడింది మంత్రిగా పదవీ స్వీకారం చేసి, నియోజకవర్గానికి రాకముందే ఈ సంఘటన జరగడం పట్ల పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ప్రాణహిత పుష్కరాలు ఈనెల 6 నుండి ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం లోని పుష్కర ఘాట్ వద్ద కొత్త సి ఎం కిరణ్ పుష్కరాలను ప్రారంభించనున్నందున పోలీసులు ప్రత్యేక బలగాలతో తనీఖీలు ముమ్మరం చేసారు. మావోలు హతమార్చిన మహదేవ్ పూర్ లోనే సి ఎం పర్యటన ఉండడంతో పోలీసులు సవాల్ గా తీసుకునే అవకాశాలున్నాయి. పోలీసుల టార్గెట్ లో ఉన్నవారు, పరిసర ప్రాంతాల ప్రజలు ఎప్పుడూ ఎం జరుగుతుందో అని బిక్కు బిక్కుమంటున్నారు. అదే విధంగా ఏటూరు నాగారం మండలంలో మూడు గ్రామాల్లో మావోయిస్టులు సంచరించి ఒకరిని హతమార్చి, ముగ్గురిని కిడ్నాప్ చేయడం, బస్సును దహనం చేయడం మహాదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి పేరుతొ లేఖను వదిలి వెళ్ళడం చర్చనీయాంశం అయింది. రెండు చోట్ల ఒకే దళం సంచరించింది! అడుగడుగునా పోలీసుల డేగ కళ్ళను తప్పించుకున్న మావోలు ఇటువంటి సంఘటనలకు పాల్పడడం విస్మయం కలిగిస్తుంది.

No comments:

Post a Comment