Tuesday, December 14, 2010

రాహుల్ ప్రధాని అయ్యేనా ?

అతి పెద్ద జాతీయ పార్టీగా ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం ముంచుకొస్తోంది. గాంధీల వారసత్వంగా భావించే ఈ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుందా. రాజీవ్ గాంధీ తరువాత సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని పక్కనబెట్టి దేశ కాంగ్రెస్ రాజకీయాలపై మంచి పట్టు సాధించారు. ఈస్ట్ అఫ్ ది ఇటాలియన్ కాదు బాస్ అఫ్ ది కాంగ్రెస్ అనిపించుకున్నారు. కానీ బీహార్ లో ఎన్నికల తరువాత ఆమెలో అంతర్మథనం మొదలైంది. రాహుల్ గాంధీ చేసిన ప్రచారం బీహార్ లో పనిచేయలేదు. మన రాష్ట్రంలో జగన్ ను పక్కన పెట్టి అధిష్ఠానం చేయి కాల్చుకుంది. దీనికి తోడు కుంభకోణాలు, తెలంగాణా అంశం, అనేక సామాజిక సమస్యలు కాంగ్రెస్ మనుగడను దెబ్బ తీస్తున్నాయి. కాంగ్రెస్ అధికారం లో ఉన్న ఏకైక పెద్ద రాష్ట్రం మనదే ఇక్కడ కూడా అధిష్ఠానం చేసిన అనేక తప్పిదాల వల్ల మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 లో  రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని పార్టీ అగ్ర శ్రేణి నాయకులతోపాటు ముఖ్యమంత్రులు చేసిన ప్రతిజ్ఞలు తారుమారయ్యే పరిస్థితులు  పుష్కలంగా ఉన్నాయి. 2014 సంగతి దేవుడెరుగు మధ్యంతరం రాకుండా చూసుకుంటే మంచిదని పరిశీలకులు అంటున్నారు.

No comments:

Post a Comment