జగన్ వర్గం పై వేటు
భవిష్యత్ తరాలకు సూచిక
ఎట్టకేలకు సి.ఎం. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గం బుధవారం పదవీ స్వీకారం చేసింది. గత కొద్ది రోజుల నాటకీయ పరిణామాలకు తెర తొలగింది. అధిష్టాన మాట వినని వారికి వేటు తప్పదని సోనియా చెప్పకనే చెప్పినట్టైంది. ప్రధానంగా జగన్ వర్గంగా ముద్ర పడ్డ మంత్రులు సుభాష్ చంద్రబోస్, బల్నేని సహా ఐదుగురికి మొండి చేయి చూపించి, భవిష్యత్ లో క్రమశిక్షణా రాహిత్యాన్ని ప్రదర్శిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో అధిష్టానం దీని ద్వారా సూచించింది. వై ఎస్ పాద యాత్ర ద్వారా జనం ముఖ్యమంత్రిగా వెలుగొందంగా అదే బాటలో ఓదార్పు ద్వారా ప్రజలకు చేరువవ్వాలని అధిష్టాన మాట వినక వివిధ పద్ధతుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ అధినాయకత్వం పై విమర్శలు చేసిన జగన్ ను ఒంటరి చేసే యత్నంలో సోనియా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ మద్దతు దారులైన ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామాలు చేస్తే ప్రజారాజ్యం శాసన సభ్యులు మద్దతు ఇవ్వడానికి ముందస్తు ప్రయత్నాలు కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంది. పిఆర్పీ అధినేత తో ఓ ప్రకటన ఇచ్చేటట్లు చేసింది. జగన్ వర్గం నుండి ఎంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారనే దాన్ని బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునేటట్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముఖ్యమంత్రి కిరణ్ తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడే పక్షంలో వెంటనే పిఆర్పీ ఎమ్మెల్యేల మద్దతు తీసుకునే అవకాశాలున్నాయి. అందుకు ఆ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి, లేదా నలుగురికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలున్నాయి.
Nice Articles....
ReplyDeleteAll The Best "Sira Velugu"