Wednesday, December 1, 2010

జగన్ కొత్త పార్టీ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ ?

మద్దతు దారులతో సమాలోచనలు
జిల్లాల వారీగా సర్వే
దివంగత వై ఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీకి వ్యూహ రచన చేసినట్లు సమాచారం. కొత్త పార్టీ పేరు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ గా నామకరణం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కడప లోక్ సభ స్థానానికి, కాంగ్రెస్ పార్టీకి పులివెందుల శాసన సభ్యురాలైన జయమ్మ సహా రాజీనామా చేసిన విషయం తెలిసిందే! మంత్రి వర్గ విస్తరణకు ముందు, తర్వాత రాజకీయ పరిణామాలు మద్దతుదారుల అభిప్రాయాల మేరకు కొత్త పార్టీకి శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. ఇడుపులపాయలో వై ఎస్ ఆర్ కు అభిమానుల మధ్య జగన్, కుటుంబ సభ్యులు నివాళులు అర్పించిన తరువాత కొత్త పార్టీ నిర్మాణం, రాజకీయ భవిష్యత్ పై పలువురితో ఆయన సమాలోచనలు జరిపినట్లు తెలుస్తుంది. మంత్రి పదవి దక్కని వారు, ఆది నుండి జగన్ టో అనుబంధం ఉన్నవారు ఆయన పెట్టే పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయి. కడప, అనంతపురం, శ్రీకాకుళం... తదితర సీమాంధ్ర జిల్లాల నుండే కాకుండా తెలంగాణా జిల్లాల నుండి కూడా జగన్ పార్టీలోకి ప్రజా ప్రతినిధులు, అభిమానులు చేరే అవకాశాలున్నాయి. జగన్ తెలంగాణా ఏర్పాటు పై తొలుత అడ్డు తగిలినా తరువాత పరిణామాల నేపథ్యంలో ఎటువంటి ప్రకటనలు చేయలేదు. తెలంగాణాకు జగన్ వ్యతిరేకం కాదని వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కొండా సురేఖ పలు సందర్భాల్లో ప్రకటించారు. వరంగల్ జిల్లా నుండి జగన్ కు మద్దతు తెలిపే వారిలో ఆమెతో పాటు ఎమ్మెల్యే మాలోతు కవిత, ఎమ్మెల్సీ పద్మావతి సహా ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు జగన్ పార్టీలోకి వలస వెళ్ళే అవకాశాలున్నాయి. కిరణ్ ప్రభుత్వాన్ని మైనార్టీలోకి నెట్టడానికి 20 మందికి పైగా ఎమ్మెల్యేలను లాగాలి. అయితే ఇప్పటికే కిరణ్ జగన్ వర్గంలోకి ఎవరెవరు, ఎంత మంది వేల్లనున్నారనే దానిపై అధ్యయనం చేసినట్లు తెలుస్తుంది. అందుకు కాంగ్రెస్ అధినేత్రి పిఆర్పీని ముందస్తుగా ఉంచారు.

1 comment:

  1. జగన్ కి నేనే సలహా ఇచ్చా :))

    http://anvvapparao.blogspot.com/2010/11/blog-post_30.html

    ReplyDelete