Wednesday, December 22, 2010

ఉల్లి కోస్తే కాదు కొంటే కన్నీళ్ళే

దేశ వ్యాప్తంగా ఉల్లి కన్నీళ్ళు పెట్టిస్తోంది. వెల్లుల్లి భయపెట్టిస్తోంది. ధరల మంట జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రాష్ట్రంలో ఉల్లి ఎగుమతులు బాగా తగ్గాయి. ధరల తగ్గింపునకు ఏం చేయాలన్నదానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి.  సామాన్యుల విషయానికొస్తే ఉల్లి లేనిదే వంటలు చేయనివారు వీటిని కొనడానికి కాదు పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. ఈ ప్రకారంగా చూస్తే ఉల్లి కొస్తే కాదు కొంటే కన్నీరేనన్ని అనిపిస్తోంది. ఉల్లి ఎక్కువగా వచ్చే రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్ తో సహా దక్షినాది లోని మరి కొన్ని ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బ తిన్న కారణంగా తప్పని సరి పరిస్థితిలో ధరలు పెంచాల్సి వచ్చిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్ అన్నారు. మరో మూడు వారాల వరకు ఈ ధరలు భారంగానే ఉంటాయని వారన్నారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రధాని మన్మోహన్ రంగంలోకి దిగి వ్యవసాయ, వినియోగదారుల వ్యవహార శాఖలకు నిర్దిష్ట ఆదేశాలిచ్చారు. ధరల పరిస్థితిని రోజువారి ప్రాతిపదికన సమీక్షించాలని సూచించారు. దీనిలో భాగంగా సోమవారం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించారు. కాగా ధరల నియంత్రణలో సర్కారు విఫలమైందని విపక్షాలు మండిపడుతున్నారు.

No comments:

Post a Comment